Wednesday, 4 May 2016

త్రిష బర్త్ డే గిఫ్ట్ భయం భయం

చెన్నై బ్యూటీ త్రిష అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన ప్రతిభావంతురాలు కూడా సుదీర్ఘమైన కెరీర్లో తన ట్యాలెంట్ ను చూపించేందుకు పూర్తిగా అవకాశం చిక్కలేదని ఫీలవుతూ ఉంటుంది ఈ సుందరి  మే 4న ఈ బ్యూటీ పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చి ఆకట్టుకుంది

నాయకి సినిమా కోసం ఓ ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేసింది త్రిష  ఈ మూవీ హారర్ కామెడీ కావడంతో ఆ జోనర్ కి దగ్గరగా ఉండేందుకు 'భయం భయం' అంటూ ఓ సాంగ్ ని చేసేసింది త్రిష. ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే.. ఎక్కువ హంగామా లేకుండా  త్రిష తన ఒరిజినల్ ట్యాలెంట్ ని చూపించేందుకు గట్టిగానే ట్రై చేసింది. అన్నిటి కంటే మించి ఈ సాంగ్ ను స్వయంగా త్రిషనే పాడడం విశేషం

వాయిస్ హస్కీగా ఉండడం పాట కూడా భయం జోనర్ లోది కావడంతో.  త్రిష గొంతు ఈ పాటకు బాగానే సెట్ అయింది. అలాగే హడావిడి పడిపోకుండా కాజువల్ గా త్రిష వేసిన స్టెప్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి . వీటికి తోడు 33 ఏళ్ల వయసులోనూ త్రిష ఎనర్జీని చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఇక పాటతో పాటు మధ్యమధ్యలో అరుపులు సౌండ్స్ ని కూడా డబ్బింగ్ చెప్పేసి త్రిష బాగానే కష్టపడింది. మొత్తానికి అభిమానులకు త్రిష ప్లాన్ చేసిన గిఫ్ట్ అయితే సూపర్ అనాల్సిందే.........

Stay tuned for more updates........

No comments:

Post a Comment